పుడమి బారతికి పురిటినెప్పులు
తల్లీ భారతీ !
అసలు నీకు నెప్పులుండవామ్మా
కృతయుగం నుంచీ కంటూనే ఉన్నా?
మాకు తెలుసులే అప్పుడు లేకున్నా ఇప్పుడొస్తాయని
పసిమొగ్గల్లో సైతం ఆడతనం చూసి చిదిమేస్తున్నప్పుడూ
విద్దెలతల్లిని వివస్త్రని చేసి రంగులద్ది అంగట్లో నిలబెట్టినప్పుడూ
దాన్ని కళ అని సరిపెట్టుకొన్నప్పుడూ
వేల పతివ్రతల్ని నీలి చిత్రాల్లో బందీల్ని చేసి ఆటాడుకొన్నప్పుడూ
ఆకలితో పసితనం పనితనమై పతనమౌతున్నప్పుడూ
చదువుకోసం విదేశాలకెళ్ళిన చంటోళ్ళు
చదువవకుండానే స్మశానానికి కొలువులకెళ్ళిపోయినప్పుడూ
ప్రేమ పేరుతో ఆడపడుచులను అడ్డంగా నరికేస్తున్నప్పుడూ
ఆహా ! ఎన్నని చెప్పాలమ్మా మా ప్రతిభలు?
అయినా నువ్వు భరిస్తావు - ఎందుకంటే
నువ్వు బ్రహ్మలను సైతం కనగల ఆడదానవు
క్షమ అనే పదమొక్కటే తెలిసిన అమ్మవు
శిష్టులైనా భ్రష్టులైనా నువ్వు భరిస్తావు
తప్పైనా గొప్పైనా నీ బిడ్డలమే మేమని సరిపెట్టుకొంటావు
ఏ నొప్పి నుంచైనా ఎవరైనా మహాబలి ఉద్భవించకపోతారా
నిన్నుద్ధరించకపోతారా అని ఎదురు చూస్తావు
ఎండిన బీళ్ళవంటి కళ్ళతో - రేపటి ఆశతో
అందుకే చెపుతామెప్పటికీ " తల్లీ నీకు జోహార్లు
ఓపిక ఒద్దిక నీకు మారుపేర్లు " అని
నిన్ను తలచాక ఆడజన్మంటే మాకు భయం లేదు తల్లీ
మరుజన్మను సైతం నీ బిడ్డలుగా మాత్రమే పుడతాం
నీ నెప్పుల్ని కడతేర్చే మహాయజ్ఞంలో సమిధలమైనా సరే
తీర్చలేని నీ ఋణాన్ని జన్మజన్మలకూ మోసుకొనిపోతాం....................................మీ చందు
Poetry is the breath and finer spirit of all knowledge- William Wordsworth Quote / Quotation

Buffalo Race, India

Lake Assal, Djibouti

Reindeer, Scandinavia

Riverbank, Belgrade

Elephants, Uganda

Iguazu Falls

Stargazer, Lake Malawi

Horses, Iceland

Ur’s CHANDHU
bye bye!!
No comments:
Post a Comment