నన్ను చంపకండి ప్లీజ్
ఆడపిల్ల నని తెలిసి
ఆదిలోనే తుంచేయ్యలనుకున్నారా
అబర్సాను పేరుతొ నను ఉరి తీయలనుకున్నారా
ఎంత మంది ఆప్తులు నీకున్న
అపుడు నిన్ను కన్నది ఆడదే
ఇపుడు నీ సేద తిర్చేది "ఆడదే"
అంట బాధలో వున్న బాసటగా నిలిచేది "ఆడదే"
ఎన్ని కష్టాలొచ్చిన చలించకుండా
నీకు తోడుగా వుండేది "ఆడదే"
అణువంత నిన్ను నవమాసాలు తనలో బాగంగా చేసి రక్షణ కల్పించి నీ కోసమై బదికేది "ఆడదే"
ఆయుష్షు పోసి నిను కని కంటి పాపలా పెంచిన నేరానికి అర్దాకలితోడు అపనిందల అపహాస్యాల నీడనే ఇచ్చినా నోరు మెదపని "మహా సాధ్వి" కూడా "ఆడదే"
అర్ద రాత్రిలో నీవు ఉలిక్కి పడి లేవగానే నిదుర పోకుండా కపాల కాసే పిచ్చి "తల్లి" కూడా"ఆడదే"
అకస్మాత్తుగా ఏడ్చినా కాస్త వంట్లో నలతగా వున్న
"నా బంగారు కొండ" త్వరగా కోలుకోవాలని
తల్లడిల్లి పోయీ వేలసార్లు కనిపించిన దేవుళ్ళకు మొక్కి మరి ఉపవాసలుండేది కూడా "ఆడదే"
అపురూపంగా చూసుకున్నకన్నబిడ్డ కంట్లో నలుసై
కలవర పెట్టినా కన్నీరును కార్చి
చిరు నవ్వు నవ్వేది కూడా "ఆడదే"
అడుగడుగునా అగచాట్లు ఎదురైనా
అలుపెరుగకుండా ఆటుపోట్లను ఎదుర్కొని
నీ హోదాను పెంచేందుకు కష్ట పడేది కూడా "ఆడదే"
అమ్మ అన్న పిలుపులో కమ్మదనం అక్క
అన్న వరుసలో తీయదనం
సఖి అన్న బందానికి వుండే గొప్పతనం
మీకు తెలిసి కూడా నన్ను చంపేస్తార ………
దయచేసి నా తల్లికి గర్భ శోకాన్ని కల్గించకండి.
అందమైన ఈ ప్రపంచం
నాకు కూడా చూడాలని వుంది
అందరిలో తిరుగుతూ
అందరి మన్ననలు పొందాలని వుంది
అలుపెరుగకుండా పొత్తిళ్ళలో వుంచి కనీ పెంచిన
నా "తల్లి" ఋణం తీర్చుకోవాలని వుంది
ఆడదిగా పుట్టి అగచాట్లు పడ్డ మా "అమ్మకు" అపురూపంగా చూసుకొని అలన పాలనా చూడాలని వుంది
ఎంత బాధలో ఉన్నా తన రక్తాన్ని కమ్మని పాల దారగా చేసి నా కందిచ్చిన "మాతృ మూర్తిని"
తనివితెర ముద్దాడాలని వుంది ………
అందుకే ...దయచేసి నన్ను చంప వద్దు ప్లీజ్
ఈ కవిత ను రచించిన మన ఫ్రెండ్ సరిత కి మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ చందు
శుభోదయం!
No man was ever yet a great poet, without being at the same time a profound philosopher. For poetry is the
blossom and the fragrance of all human knowledge, human thoughts, human passions, emotions, language- Samuel Taylor Coleridge
blossom and the fragrance of all human knowledge, human thoughts, human passions, emotions, language- Samuel Taylor Coleridge
Good Morning! |
1 comment:
ఎక్కడ నుంచి ఎలా గుర్తించి నా పేరుతో సహా నా కవితను తీసుకొని మీ బ్లాగ్ లో పొందుపరిచారో తెలియదు కాని చాలా చాలా ధన్యవాదాలు
Post a Comment